హైదరాబాద్, నవంబర్ 30 (విజయక్రాంతి): ఫార్మసిస్ట్ గ్రేడ్-2 పరీక్షలు శనివారం ప్రశాంతంగా ముగిశాయి. మొత్తం 732 పోస్టులు ఉన్నాయి. కంప్యూటర్ బేస్డ్ (సీబీటీ) పరీక్షలకు 27,101 మంది దరఖాస్తు చేసుకోగా.. 24,578 మంది హాజరయ్యారని మెడికల్ అండ్ హెల్త్ సర్వీ సెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు తెలిపింది.