07-03-2025 01:54:47 AM
పని విధానంలో కూడా మార్పులు తీసుకురాబోతున్నాం
కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ
బేగంపేట్‌లో కొత్త ఈపీఎఫ్‌వో జోనల్ ఆఫీస్ ప్రారంభం
హాజరైన కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 6 (విజయక్రాంతి): భవిష్యత్‌లో ఏటీఎంతో ఈపీఎఫ్‌వో విత్‌డ్రాతోపాటు ఇతర లావాదేవీలను నిర్వహిం చుకునేలా మార్పులు తీసుకురాబోతున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. ప్రస్తుతం దేశంలో ఎక్కడ పనిచేసే వారైనా బ్యాంకుల నుంచి నేరుగా విత్‌డ్రా చేసుకునే సౌకర్యాన్ని కల్పించామన్నారు. గురువారం బేగంపేట్‌లో కొత్త ఈపీఎఫ్‌వో జోనల్ కార్యాలయాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డితో కలి సి ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాండవీయ మాట్లాడుతూ.. గతం లో ఈపీఎఫ్‌వో కార్యకలాపాల్లో చిన్నిచిన్న సమస్య లు ఉండేవన్నారు. ప్రస్తుతం వాటిని పరిష్కరించినట్లు వెల్లడించారు. కార్మికులకు సేవల ను అందించేందుకు అధికారులు ఎల్లవేళలా సిద్ధంగా ఉండాలన్నారు.
దేశానికి వెన్నెముక కార్మికులేనని, ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రధాని మోదీ నాయకత్వంలో పనివిధానంలో కూడా మార్పులు తీసుకురాబోతున్న ట్లు ప్రకటించారు. కార్మికులకు సేవలందించే ఈపీఎఫ్‌వో ఆఫీస్‌ను దేవాలయంగా అభివర్ణించారు. భవిష్యత్‌లో ఈపీఎఫ్‌వో కార్యక లాపాలు ఆఫీసులకే పరిమితం కాకుండా, డిజిటల్ పరంగా మరింత విస్తృతం చేస్తామ ని చెప్పారు. సేవల కోసం ఇప్పటికే 201 టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రారంభించామన్నారు.
మూడురోజుల్లోనే ఈపీఎఫ్‌వో క్లుమైలు.. బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి
ఈపీఎఫ్‌వో క్లుమైలను మూడు రోజుల్లోనే చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని మోదీ స్పష్టమైన ఆదే శాలు ఇచ్చారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. బేగంపేట్‌లో కొత్త జోనల్ ఆఫీస్‌ను మంజూరు చేయడంపై ప్రధాని మో దీ, కేంద్రమంత్రి మాండవీయకు ధన్యవాదాలు తెలిపారు.
కార్మికుల సంక్షే మం కోసం కేంద్రం అనేక విధానాలను తీసుకురాబోతోందని చెప్పారు. కార్మికుల కోసం అస్యూర్డ్ బెన్‌ఫీట్ కింద రూ.50వేలు ఇవ్వాలని నిర్ణయించడంపై కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే సనత్‌నగర్ ఈఎస్‌ఐ ఆస్పత్రి నంబర్ నిలిచినట్లు చెప్పారు. కామ ర్స్ రంగంలో పనిచేసే వారికి ఈపీఎఫ్‌వో ఫలాలను అందించాలని పీఎంకు వివరిస్తానన్నారు.