calender_icon.png 28 September, 2024 | 4:37 PM

జంతు ప్రేమికులకు కలెక్టర్ కీలక సూచనలు

28-09-2024 01:46:02 PM

సూర్యాపేట, (విజయంక్రాంతి): ప్రజలు వారి ఇళ్ళలోని పెంపుడు జంతువులకు తప్పక ప్రతి ఆరు నెలలకు ఒకసారి టీకాలు వేయించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ సూచించారు. శనివారం ప్రపంచ రేబీస్ దినోత్సవం సందర్భంగా జిల్లా పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జంతువులకు ఉచిత టీకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..... జంతు ప్రేమికులు వాటి పట్ల అవగాహన కలిగి ఉండాలని, పెంపుడు జంతువుల నుంచి మ‌నుషుల‌కు రేబిస్‌, మెద‌డువాపు, ఆంథ్రాక్స్‌, బ్రూసెల్లోసిస్‌, క్ష‌య‌, సాల్మ్ నెల్లోసిన్‌, లెప్టోస్పైరోసిన్‌, ప్లేగు, బ‌ర్డ్‌ప్లూ వంటి వ్యాధులు సంక్రమించకుండా ఉండేందుకు పశువైద్యులను సంప్రదించాలన్నారు. విధిగా టీకాలు వేయించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్. శ్రీనివాసరావు, వైద్యులు జానయ్య, గోపి, కిరణ్, కృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.