12-04-2025 12:16:01 AM
సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్వర్‌రెడ్డి సూచన
అబ్దుల్లాపూర్ మెట్, ఏప్రిల్ 11: నాణ్యత ప్రమాణాలతో కూడుకున్న పెట్రోల్ డీజిల్ వినియోగదారులకు అందించే విధంగా పెట్రోల్ బంకు నిర్వాహకులు ముందుకు వెళ్లాలని సూర్యాపేట ఎమ్మె ల్యే గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండల మండల కేంద్రంలో జెఎంఆర్ నూతన పెట్రోల్ బంక్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మె ల్యే గుంటకండ్ల జగదీశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వినియోదారులకు పెట్రోల్ బంక్ నిర్వాహకులు నాణ్యత ప్రమాణాలతో కూడిన పెట్రోల్, డీజిల్ విక్రయిం చాలన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ భువనగిరి పార్లమెంట్ ఇన్ చార్జీ క్యామ మల్లేష్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి, గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్‌రెడ్డి, నల్లగొండ మాజీ ఎమ్మె ల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్, జేఎంఆర్ పెట్రోల్ బంక్ నిర్వాహకులు జెక్కిడి రఘు రఘువీర్ రెడ్డి, ఎల్బీనగర్ బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.