19-03-2025 10:19:51 PM
మునిపల్లి: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుదేరాలోని హెచ్ పి పెట్రోల్ బంక్ మేనేజర్ మృతి చెందిన సంఘటన ఇది. మునిపల్లి ఎస్సై రాజేష్ నాయక్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యాదాద్రి భువనగిరికి చెందిన నితీష్ కుమార్ (28) గత కొంత కాలంగా మునిపల్లి మండలంలోని బుదేరా చౌరస్తాలో గల హెచ్ పి పెట్రోల్ బంక్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. బాంక్ కు సంబంధించిన షెడ్డుకు సంబంధించిన రేకులు పగిలిపోవడంతో మరమ్మతులు చేసేందుకు ప్రయత్నం చేశారు. మంగళవారం పరిశీలించేందుకు షెడ్ పైకి ఎక్కాడంతో ప్రమాదవశాత్తు రేకుల షెడ్డు పైనుండి కింద జారి పడటంతో తలకు బలమైన గాయాలు అయ్యాయి. సంగారెడ్డిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్సై తెలిపారు. మృతుని తండ్రి చంద్రమౌళి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రాజేష్ నాయక్ తెలిపారు.