15-03-2025 10:26:14 PM
చేగుంట,(విజయక్రాంతి): ఆర్టిసి ఇండియన్ పెట్రోల్ బంకులో వినియోగదారులు పెట్రోల్ కు పోతే నీళ్లు వచ్చిన సంఘటన చేగుండా పట్టణ కేంద్రంలో జరిగింది, వివరాలకు వెళితే చేగుంట పట్టణంలో ఉన్న ఇండియన్ పెట్రోల్ బంకు ఇది ఆర్టీసీ వారి ఆధ్వర్యంలో నడపబడుతుంది. ఇక్కడ పెట్రోల్ పోసుకున్న వాహనదారులు తమ బండ్లు మార్గ మధ్యలో ఆగిపోవడంతో బండ్ల ను తనిఖీ చేయడంతో పెట్రోల్ బదులు నీళ్ల వచ్చాహి, వాహనదారులు పెట్రోల్ యజమాన్యంతో మాట్లాడగా మాకు ఎలాంటి సంబంధం లేదు పైనుంచి ఇలానే వచ్చింది ఇలానే పోసామని దురుసుగా సమాధానం చెప్పారు. వాహనదారుడు దుర్గ ప్రసాద్ మాట్లాడుతూ ఇలాంటి పెట్రోల్ బంక్ పై జిల్లా అధికారులు స్పందించి వెంటనే బంక్ లైసెన్స్ రద్దుచేసి తమకు న్యాయం చేయాలని కోరారు.
Petrol Adulteration In Chegunta