హైదరాబాద్, డిసెంబర్ 13 (విజయక్రాంతి): ప్రజాభవన్‌లో శుక్ర వారం నిర్వహించిన ప్రజావాణికి 441 అర్జీలు వచ్చినట్లు ప్రభుత్వం పేర్కొంది. ఈ వినతుల్లో పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కు సంబంధించి 110, మైనార్టీ సంక్షేమ శాఖకు సంబంధించి 76, రెవెన్యూ సమస్యలకు సంబంధించి 71, విద్యుత్ శాఖ 57, హోం శాఖ 23, ఇతర శాఖలకు సంబంధించి 104 అర్జీలు అందినట్టు అధికారు లు తెలిపారు. కార్యక్రమంలో ప్రజాపాలన ప్రత్యేక అధికారి దివ్య పాల్గొని అర్జీలను స్వీకరించారు.