calender_icon.png 23 January, 2025 | 12:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజావాణికి 360 అర్జీలు

07-12-2024 02:48:54 AM

హైదరాబాద్, డిసెంబర్ 6 (విజయక్రాంతి):ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 360 అర్జీలు అందినట్లు అధికారులు తెలిపారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ప్రజాపాలన ప్రత్యేకాధికారి దివ్య కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకున్నారు.

యువకుడి కల సాకారం 

జనగాం జిల్లా స్టేషన్ ఘన్‌పూర్ మండలం తాటికొండకు చెందిన బాణాల రమేశ్ టెంట్‌హౌస్ ఏర్పాటుకు ఎస్సీ కార్పొరేషన్ రుణం కోసం ప్రయత్నించాడు. అయితే సిబిల్ స్కోర్ లేదని, రుణం ఇవ్వలేమని బ్యాంక్ అధికారులు చెప్పారు. దీంతో రమేశ్ గత అక్టోబర్‌లో ప్రజావాణిలో అధికారులకు విషయం చెప్పి అర్జీ పెట్టుకున్నాడు. ప్రజావాణి అధికారులు బ్యాంక్ వారితో మాట్లాడి రుణం ఇప్పించారు. దీంతో రమేశ్ శుక్రవారం ప్రజాభవన్‌కు వచ్చి రుణం మంజూరు చేయించినందుకు చిన్నారెడ్డి, అధికారి దివ్యకు ధన్యవాదాలు తెలిపారు. తనకు స్వయం ఉపాధికి మార్గం దొరికిందని లబ్ధిదారుడు సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా అధికారులు అతడికి మిఠాయి తినిపించి శుభాకాంక్షలు తెలిపారు.