calender_icon.png 19 April, 2025 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యల పరిష్కారానికై అధికారులకు వినతిపత్రాలు

19-04-2025 05:05:03 PM

మంథని (విజయక్రాంతి): ఫీల్డ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఫీల్డ్ అసిస్టెంట్లు యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేల్పుల దేవేందర్ ఆధ్వర్యంలో మంథని ఫీల్డ్ అసిస్టెంట్లు రెవెన్యూ డివిజనల్ అధికారి తహసిల్దార్ కు ఎంపీడీవోకు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా  దేవేందర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాలలో గత 20 సంవత్సరాలుగా ఉపాది హమీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్లు చాలీచాలని వేతనాలతో జీవితాలను గడుపుతున్నామని, మా యొక్క సేవలను గత ప్రభుత్వలు పట్టించుకోకపోవడం బాధాకరమని, ఈ  ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఫీల్డ్ అసిస్టెంట్లకు పే స్కేల్ వర్తింపజేస్తూ వేతనాలు పెంచి ఉద్యోగ భద్రత కల్పిస్తామని పేర్కొనడం జరిగిందని,  ప్రభుత్వ హామీని అమలు చేయాలని కోరారు.

అలాగే జనవరి మాసం నుండి మూడు నెలలు వేతనాలు పెండింగ్ లో ఉన్నాయని, వెంటనే విడుదల చేయాలని కోరారు. ఉపాధి హామీలో పనిచేస్తున్న మిగతా అన్ని స్థాయిల ఉద్యోగుల మాదిరిగానే ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా ఎఫ్ టి ఈ లుగా కన్వర్ట్ చేసి కనీస వేతనం 25వేల రూపాయలు ఇవ్వాలని విధి నిర్వహణలో మరణించిన ఫీల్డ్ అసిస్టెంట్ల కుటుంబాలకి పది లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని, తొలగించిన ఫీల్డ్ అసిస్టెంట్లను తిరిగి విధులలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్ మద్దతు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మంథని మండల ఫీల్డ్ అసిస్టెంట్ల యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జెట్టి అర్జున్, తూండ్ల రాజమల్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు, రమేష్, మొగిలి, ప్రవీణ్ దేవేందర్ రెడ్డి, రమాదేవి పోచయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.