calender_icon.png 16 April, 2025 | 3:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

08-04-2025 12:31:50 AM

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి 

సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ 

ఖమ్మం, ఏప్రిల్ 7 (విజయక్రాంతి):- ప్రజలు సమర్పించిన అర్జీలను సత్వరమే పరిశీలించి పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ సంబంధిత జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డితో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ జిల్లా కలెక్టరేట్, అదనపు కలెక్టర్ కార్యాలయాల నుంచి వచ్చిన దరఖాస్తులపై తీసుకున్న చర్యల గురించి నివేదిక అందించాలని  సూచించారు. ఇక నుంచి ప్రతి శుక్రవారం ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారంపై సమీక్ష ఉంటుందని అన్నారు.

ప్రజావాణిలో మనకు వచ్చే దరఖాస్తులు మన పరిధిలో ఉంటే తప్పనిసరిగా పరిష్కరించాలని, ప్రభుత్వ నిర్ణయం, మార్గదర్శకాలపై స్పష్టత లేని పక్షంలో ఆ దరఖాస్తుదారులకు సరైన కారణాలు తెలుపుతూ సమాధానం రాయాలని, ప్రజలను మళ్లీ మళ్లీ కార్యాలయాల చుట్టూ తిప్పుకోవద్దని  కలెక్టర్ తెలిపారు.ప్రజావాణి ద్వారా వివిధ శాఖలకు 300 పైగా దరఖాస్తులు పంపితే 151 మాత్రమే స్పందన వచ్చిందని, దరఖాస్తులు పెండింగ్ ఉండటానికి వీలు లేదని కలెక్టర్ స్పష్టం చేశారు.ప్రజావాణి కార్యక్రమంలో డిఆర్వో ఏ. పద్మశ్రీ, డిఆర్డీవో ఎన్. సన్యాసయ్య, కలెక్టరేట్ ఏవో అరుణ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.