calender_icon.png 11 March, 2025 | 5:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి

11-03-2025 12:00:00 AM

కలెక్టర్ సత్యప్రసాద్ 

జగిత్యాల, మార్చి 10 (విజయక్రాంతి) : జిల్లా వ్యాప్తంగా ‘ప్రజావాణి’ కార్యక్రమంలో వచ్చే సమస్యలకు సత్వరమే పరిష్కారం చూపాలని కలెక్టర్ బి.సత్యప్రసాద్ పేర్కొన్నారు. జిల్లా సమీకృత కార్యాలయ సము దాయం కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’లో కలెక్టర్, ముఖ్య అధికారులు స్వయంగా ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను  స్వీకరించారు. 

అర్జీలను పెండింగ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పరిష్కరిం చాలన్నారు. కాగా నేటి ‘ప్రజావాణి’కి మొ త్తం 50 ఫిర్యాదులు, వినతులు వచ్చాయని, వాటిన్నంటినీ వెంటనే సంబంధిత శాఖల సిబ్బంది పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు.  అదనపు కలెక్టర్ బిఎస్.లత, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి ఆర్డీవోలు మధుసూధన్, జివాకర్‌రెడ్డి, శ్రీనివాస్ వివిధ జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ పర్యవేక్షకులు, సిబ్బంది పాల్గొన్నారు.