వికారాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): రాష్ట్రంలో సంచలనం రేపిన లగచర్ల దాడి కేసులను వికారాబాద్ జిల్లా కోర్టు నుంచి నాంపల్లి ప్రత్యేక కోర్టుకు బదిలీ చేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. లగచర్లలో అధికారులపై దాడి చేసిన ఘటనలో జైల్లో ఉన్న రైతులు ఇక మీదట తమ బెయిల్ పిటిషన్లను నాంపల్లి స్పెషల్ కోర్టులో వేసుకోవాల్సి ఉంటుంది.
కాగా ఈ కేసులో ఏ ఉన్న సురేశ్‌ను మంగళవారం సంగారెడ్డి జైలు నుంచి పోలీసులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. కేసులో ఏ ఉ్న సురేశ్‌ను పరిగి పీఎస్‌కు తరలించి మల్టీజోన్ ఐజీ సత్యనారాయణ సమక్షంలో విచారించినట్లు తెలిసింది.