24-02-2025 12:33:45 AM
ఆదిలాబాద్, ఫిబ్రవరి 23 (విజయ క్రాంతి): మాలి కులస్తుల ఎస్టీ హోదా బిల్లు తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం తెలిపి కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపడం జరిగిందని అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే అన్నారు. అ బిల్లు కేంద్రం వద్ద పెండింగ్ లోనే ఉందని త్వరలోనే పార్లమెంట్లో బిల్లు పాస్ చేసి మాలీలకు ఎస్టీ హోదా కల్పించేలా చర్యలు చేపట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కోరారు.
సంఘం రాష్ట్ర కోశాధికారి సతీష్ గురునూలే తో కలిసి ఆదివారం జిల్లా కేంద్రానికి వచ్చిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని వినతి పత్రం అందించారు. కేంద్రమంత్రికి మాలీల ఎస్టీ హోదా విషయం ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ వివరించగా మంత్రి సానుకులంగా స్పందించారు. మాలి మహా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్ గుర్నూలె, రాష్ట్ర ప్రచార కార్యదర్శి మురళీధర్ లు పాల్గొన్నారు. మంత్రి వెంట ఎంపీ నగేష్, సిరిపూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ రావు ఉన్నారు.