ఆదిలాబాద్ (విజయక్రాంతి): అంగన్వాడీ టీచర్ లు, ఆయాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఎమ్మెల్యే పాయల్ శంకర్ కు అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విన్నవించారు. ఈ మేరకు ఆదిలాబాద్ లో మంగళవారం ఎమ్మెల్యే పాయల్ శంకర్ ను కలిసి యూనియన్ నాయకురాలు రాధా వినతి పత్రాన్ని సమర్పించారు. టీచర్లు, ఆయాలు ఎదుర్కొంటున్న సమస్యలను అసెంబ్లీలో చర్చించి, పరిష్కరించేలా చూడాలని ఎమ్మెల్యేని కోరారు. గుజరాత్ హైకోర్టు ఇచ్చిన తీర్పులాగా తెలంగాణలో సైతం టీచర్లు, ఆయాలు 3rd, 4th క్లాస్ ఎంప్లాయిస్ గా గుర్తించాలని కోరారు. టీచర్ లకు 26 వేలు, ఆయాలకు 18 వేలు ఇవ్వాలని అన్నారు. ఇతరత్రా సమస్యలను పరిష్కరించేల చూడాలని ఎమ్మెల్యేకు విన్నవించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీచర్లు, ఆయాలు పాల్గొన్నారు.