05-03-2025 01:25:07 AM
ఖమ్మం, మార్చి 4 ( విజయక్రాంతి ): ఈనెల ఒకటో తేదీన ఖమ్మం బార్ అసోసియేషన్ న్యాయవాది తాళ్లూరి దిలీప్ ఆధ్వ ర్యంలో 35 బిఎన్‌ఎస్ ఎస్ (41 ఏ సి ఆర్ పి సి ) సెక్షన్ సవరణపై పెట్టిన చర్చ గోష్టి లో చేసిన తీర్మానాలపై ఫెడరేషన్ అఫ్ బార్ అసోసియేషన్స్ ప్రెసిడెంట్ వై కొండల్ రెడ్డి తో కలసి మంగళవారం లా సెక్రటరీ రెండ్ల తిరుపతిని తన కార్యాలయంలో కలసి వినతి పత్రం అందజేశారు. సెక్షన్స్ లో బాధితులకి అనుకూలంగా నిందుతులని రిమాండ్ చె య్యాలని, లేని పక్షాన బాధితులకు అన్యా యం జరుగుతున్నదని, పబ్లిక్ ప్రాసెక్యూటర్స్ అపాయింట్మెంట్స్, వారి పరిధిని హోమ్ డిపార్ట్మెంట్ నుండి లా డిపార్ట్మెంట్ కి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ద్వార చెయ్యాలని కోరారు.
197వ లా కమిషన్ రిపోర్ట్ ప్రకారంగా 50 శాతం పబ్లిక్ ప్రాసెక్యూటర్ పోస్టు లను టెన్యూర్ పద్దతిలోను, మిగిలిన 5o శాతం క్యాడర్ పద్దతిలో కేటాయించే విధం గా చూడాలన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేస్తానని లా సెక్రెటరీ ఈ సందర్బంగా వారికి హామీ ఇచ్చారు. ఫెడరేషన్ అఫ్ బార్ అసోసియేషన్స్ వైస్ ప్రెసిడెంట్, ఖమ్మం బార్ అసోసియేషన్ అధ్యక్షులు నేరళ్ళ శ్రీనివాసరావు, 35 బి ఎన్ ఎస్ ఎస్ ఉద్యమ కమిటీ కన్వీనర్ తాళ్లూరి దిలీప్ చౌదరి, మాజీ పబ్లిక్ ప్రాసెక్యూటర్ పసుపులేటి శ్రీనివాసరావు పాల్గొన్నారు.