calender_icon.png 24 February, 2025 | 8:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని తహసీల్దార్ కు వినతి

24-02-2025 05:07:23 PM

లక్షేట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలోని ప్రభుత్వ భూములను గుర్తించి అర్హులైన పేదలకు ఇంటి స్థలాలు కేటాయించాలని సీపీఐ మండల కమిటీ ఆధ్వర్యంలో సోమవారం తహసీల్దార్ దిలీప్ కుమార్ కు నాయకులు వినతిపత్రం అందజేశారు. మున్సిపాలిటీలో అనేకమంది పేదలు నివాస స్థలం లేకపోవడంతో ఎన్నో రకాల ఇబ్బందులు పడుతున్నారన్నారు. పూరి గుడిసెల్లో, అద్దె ఇండ్లల్లో ఉండి జీవితాంతం కష్టాలతో నెట్టుకొస్తున్నారని వివరించారు. ఎన్నోసార్లు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు, అధికారులకు విన్నవించిన కూడా పట్టించుకోవడం లేదన్నారు.

వెంటనే మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ స్థలాలను గుర్తించి వాటిని అన్యాక్రాంతం కాకుండా కాపాడి, పేదలకు కేటాయించాలన్నారు. అధికారులు చర్యలు చేపట్టకపోతే ఉద్యమ పోరాటాల ద్వారా పేద ప్రజల హక్కులను సాధిస్తామని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ మండల కార్యదర్శి మేదరి దేవవరం, ఏఐటీయూసీ మండల కార్యదర్శి కేతిరెడ్డి రమణారెడ్డి, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి లింగంపల్లి భాను చందర్, సీపీఐ పట్టణ కార్యదర్శి రాచర్ల రవి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.