01-02-2025 01:46:18 AM
హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): ఫోన్‌ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ డీసీసీ రాధాకిషన్‌రావు గతంలో పంజాగుట్ట పోలీసులు తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై శుక్రవారం హైకో ర్టు విచారణకు అనుమతించగా, రాధాకిషన్‌రావు వాదనలు వినిపించారు.
తన ఫోన్ ట్యాప్ అయిందని చక్రధర్ గౌడ్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడని, ఈ కేసులో తొలి నిందితుడిగా మాజీమంత్రి హరీశ్‌రావు, తాను రెండో నిం దితుడిగా ఉన్నానని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
ఇదే కేసులో మేజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలంలోని విషయాలనే చక్రధర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారని, బీఎన్‌ఎస్ సెక్షన్- 161 కింద ఇచ్చిన వాంగ్మూలాన్నే ఎఫ్‌ఐఆర్ చేయడం చెల్లదని, తనకు బెయిలు రాకుండా చేయాలనే కుట్రతోనే చక్రధర్ గౌడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు.
విచారణకు ముందే జైలుశిక్ష విధించాలనే లక్ష్యంతో చేసిన గౌడ్ కుట్ర పన్నారని కోర్టుకు తెలిపారు. తనకు హైకోర్టు ఇప్పటికే పాత కేసులో బెయిలు మంజూరు చేసిందన్నారు.