04-03-2025 05:00:26 PM
చిట్యాల ఎంపీఎస్ఓకు వినతి పత్రం అందజేత
చిట్యాల,(విజయక్రాంతి): విచ్చలవిడిగా కొనసాగుతున్న అక్రమ రేషన్ బియ్యం దందాను అరికట్టాలని సిపిఐఎంఎల్ లిబరేషన్ జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్(CPI ML Liberation District Secretary Marapalli Mallesh) డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో ఈ మేరకు ఆయన ఎంపీఎస్ఓకు రేషన్ బియ్యం దందాపై వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మండలంలోని జూకల్ కేంద్రంగా రేషన్ బియ్యం దందా కొనసాగుతుందని తెలిపారు. రేషన్ బియ్యం కొనుగోలు చేసిన అనంతరం కొన్ని రైస్ మిల్లులకు తరలిస్తున్నారని ఆరోపించారు.కొంతమంది రేషన్ డీలర్లు లబ్ధిదారుల నుండి కేజీకి 7నుండీ 10 రూపాయలకు రేషన్ బియ్యాన్ని కొంటూ వాటిని మధ్య దళారీలకు ఎక్కువ రేటుకి అమ్ముకుంటూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.అదేవిధంగా మండలంలోని రైస్ మిల్లర్లు పిడిఎస్ దొడ్డు బియ్యాన్ని రీసైక్లింగ్ చేసి సన్నబియంగా మార్చి గ్రామాలలోని కిరాణాలలో ఎక్కువ రేటుకు అమ్ముకుంటూ ప్రజలను దోపిడీ చేస్తున్నారన్నారు.కావున మండల రెవెన్యూ అధికారులు, జిల్లా కలెక్టర్ స్పందించి తనిఖీలు నిర్వహించి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో నాయకులు కనకం తిరుపతి పాల్గొన్నారు.