ఫీజు రీయింబర్స్ బకాయిలు విడుదల చేయాలని కోరిన ప్రైవేట్ కాలేజీల ప్రతినిధులు
హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): ఫీజు రీయింబర్స్‌మెంట్ బకా యిలను వెంటనే విడుదల చేయాలని ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినట్లు.. అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సూర్యనారాయణ రెడ్డి, రామకృష్ణ, కార్యనిర్వాహక అధ్యక్షుడు పరమేశ్వర్ తెలిపారు. గడిచిన మూడు సంవత్సరాలుగా.. ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపో వడంతో కళాశాలల నిర్వహణ భారం గా మారిందని వాపోయారు. సానుకూలంగా స్పందించిన జీవన్ రెడ్డి సీఎం, ఆర్థిక మంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్తానని హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు.