29-03-2025 08:59:50 PM
తలకొండపల్లి,(విజయక్రాంతి): గత సంవత్సరం కురుసిన వర్షాలకు చెరువు కట్టలు తెగిపోయి గండ్లు పడ్డాయి.గండ్లను పూడ్చి చెరువు కట్టలకు మరమత్తులు చేయాలని కోరుతూ కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి(Kalwakurthy MLA Kasireddy Narayana Reddy)ని కోరారు. తలకొండపల్లి మండలం పడకల్ గ్రామంలోని పందివాని కుంట,వీరన్న చెరువులకు కూడా గండ్లు పడ్డాయి. రాబోయే వర్షాకాలం వరకు గండ్లు పడ్డ చెరువులకు మత్తులు చేసి చెరవులలో నిరునిలిచే విదంగా చూడాలని కోరుతూ శనివారం గ్రామస్తులు మాజీ ఎంపిటిసి జోగు రమేష్,మాజీ సర్పంచ్ శ్రీశైలం,శతాబ్ది టౌన్ షిప్ మేనేజింగ్ డైరెక్టర్ కాసు శ్రీనివాసురెడ్డి, కాంగ్రేస్ పార్టీ నాయకులు లట్టుపల్లి జగ్గారెడ్డి, రాజమొని శంకర్ లు ఎమ్మెల్యే నారాయణరెడ్డి ని కలిసి వినతిపత్రం అందజేశారు. స్పందించిన ఎమ్మెల్యే సంబందిత అదికారులతో మాట్లాడి చెరువు గండ్లను పుడ్చే విదంగా చూస్తానని గ్రామాస్తులకు హామీ ఇచ్చారు.