శ్రీరంగాపురం జనవరి 4 : మండల పరిధిలోని కంబా ల పురం తండా సమస్యలపై ఎమ్మెల్యే తూడు మేఘారెడ్డికి శనివారం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బలరాం నాయ క్, బీరం రాజశేఖర్ రెడ్డిలు మాట్లాడుతూ.. తాండలో నూతన రేషన్ దుకాణం, బస్సు సౌకర్యం, నూతన గ్రామపంచాయతీగా ఏర్పాటుతోపాటు పలు సమస్యలపై ఎమ్మెల్యేకు వివరించారు. ఎమ్మెల్యే స్పందిస్తూ సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.