calender_icon.png 26 March, 2025 | 1:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గ్రామపంచాయతీ సిబ్బంది సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి

24-03-2025 02:44:09 PM

బెల్లంపల్లి,(విజయక్రాంతి): గ్రామ పంచాయతీలలో పనిచేసే కారోబార్, బిల్ కలెక్టర్, సిబ్బంది సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించిన చూడాలని సోమవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు పాత బెల్లంపల్లి గ్రామంలో తెలంగాణ గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు. గత ప్రభుత్వం తీసుకు వచ్చిన 51 జీవో వల్ల గ్రామ పంచాయతీలో పనిచేసే తమకు మల్టీపర్పస్ వర్కర్లుగా కాలువలు తవ్వించేందుకు అధికారులు పేర్కొన్నారు. తమ ఆత్మ అభిమానాన్ని దెబ్బతీసే విధంగా ఉన్న జీవో 51ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి జిల్లా కలెక్టర్, జిల్లా పంచాయతీ అధికారులతో మాట్లాడి తమకు సర్వీస్ సర్టిఫికెట్లు అందించాలని కోరారు. ప్రతి గ్రామపంచాయతీలో ఐదు నెలల పెండింగ్ వేతనాలు వెంటనే ఇప్పించాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కారుకూరి రామ్ చందర్ ఉన్నారు.