03-03-2025 01:09:48 AM
తిరుమలాయపాలెం, మార్చి 2 (విజయ క్రాంతి): విదేశీ పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఎన్నారై సెల్ కన్వీనర్ యల్మరెడ్డి నరేందర్ రెడ్డి ఆదివారం అమెరికాలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తిరుమలాయపాలెం మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిని మరింతగా అభివృద్ధి చేయించాలని, ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ గృహం మంజూరు చేయాలని,ఇతర సమస్యలను పరిష్కరించాలని ఆయన మంత్రిని కోరినట్లు తెలిపారు. సానుకూలంగా స్పందించిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తప్పకుండా తిరుమలాయపాలెం మండల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారని తెలిపారు.