calender_icon.png 22 December, 2024 | 4:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్సీ వర్గీకరణపై కమిటీని రద్దు చేయాలని వినతి

14-09-2024 05:01:44 PM

మంచిర్యాల, విజయక్రాంతి: మాలమహానాడు ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులు జూపక సుధీర్ ఆధ్వర్యంలో ఢిల్లీ అక్బర్ రోడ్డు లోని ఏ ఐ సి సి కాంగ్రెస్ కార్యాలయం లో కాంగ్రెస్ అసంఘటిత ఉద్యోగ జాతీయ చైర్మన్ డాక్టర్ ఉదిత్ రాజ్ కు ఎస్ సి వర్గీకరణ పై తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా కమిటీని రద్దు చేయాలనీ శనివారం వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా మాలమహానాడు జాతీయ అధ్యక్షులు డాక్టర్ పసుల రాంమూర్తి మాట్లాడుతూ ఎస్ సి వర్గీకరణ పై సుప్రీం కోర్టు తీర్పు రద్దు చేయించాలి, కానీ తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఏ రాష్టం వారు తీసుకోని నిర్ణయాన్ని తీసుకోవడం పధ్ధతి కాదన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కమిటీ వెంటనే రద్దు చేయాలనీ తెలంగాణ ఇంచార్జి దీపదాసు కు వినతి పత్రాన్ని పంపాలని కోరారు. వినతి పత్రం అందజేసిన వారిలో జాతీయ యువజన ప్రధాన కార్యదర్శి మగ్గిడి దీపక్, రాష్ట్ర మహిళ ఉపాధ్యక్షురాలు అరె దేవకర్ణ, రాష్ట్ర మహిళ కార్యదర్శి గంట బభిత తదితరులున్నారు.