calender_icon.png 24 February, 2025 | 7:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జర్నలిస్టులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలి

24-02-2025 04:19:31 PM

జిల్లా కలెక్టర్ కు టీయుడబ్ల్యూజే (ఐజేయు) వినతి

జయశంకర్ భూపాలపల్లి,(విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో పని చేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులందరికి ప్రమాద భీమా సౌకర్యం కల్పించాలని కోరుతూ టీయుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా టీయుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు క్యాతం సతీష్, సామంతుల శ్యామ్ లు మాట్లాడుతూ... వార్తల సేకరణ కోసం నిరంతరం తిరుగుతూ, ప్రజలకు ప్రభుత్వాలకు మద్య వారధిగా జర్నలిస్టులు పనిచేస్తున్నారు. ఎలాంటి జీతభత్యాలు లేకుండా నిరంతరం రోడ్లపై తిరుగుతూ వార్తలు సేకరిస్తున్న జర్నలిస్టులకు ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉంది.

కాబట్టి జర్నలిస్టుల కుటుంబాలకు భరోసా కల్పిస్తూ జిల్లాలో పనిచేస్తున్న  జర్నలిస్టులందరికి ప్రమాద బీమా పాలసీ చేయించేందుకు జిల్లా కలెక్టర్  బడ్జెట్ నుండి నిధులు కేటాయించాలని కోరారు. వార్తల సేకరణలో ప్రమాదవశాత్తు జర్నలిస్టులకు ఏదైనా ప్రమాదం జరిగితే ఈ ప్రమాద బీమా ఎంతగానో ఉపకరిస్తుందని, ఈ ప్రమాద భీమా పాలసీని చేయించి, జిల్లాలో పని చేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులందరికి ప్రమాద భీమా పత్రాలను అందజేయాలని ఈ సందర్భంగా వారు జిల్లా కలెక్టర్ ను కోరారు. ఈ కార్యక్రమంలో ఐజేయు రాష్ట్ర హెల్త్ కమిటీ మెంబర్ సామల శ్రీనివాస్, రాష్ట్ర ఈసీ మెంబర్ విజయ్, ఐజేయు జిల్లా ఉపాధ్యక్షుడు తడుక సుధాకర్, టెంజు జిల్లా అధ్యక్షుడు కొంకుల సాంబయ్య, సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ సమ్మయ్య గౌడ్, జర్నలిస్టులు సాంబయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు.