calender_icon.png 19 April, 2025 | 4:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లావ్యాప్తంగా పీఆర్టియూ నిరసనలు

28-03-2025 11:28:07 PM

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పిఆర్టియు టిఎస్ జిల్లా కమిటీ పిలుపు మేరకు GPF, TSGLI, సరెండర్ లీవ్ బిల్లులు ,రిటైర్డ్మెంట్ బెనిఫిట్స్ ను వెంటనే చెల్లించాలని, అదేవిదంగా పెండింగ్ లో వున్న 5 DA లు, PRC ప్రకటించాలని, పొదిలి. సత్యనారాయణ కుటుంబానికి న్యాయం చేయాలనీ కోరుతూ శుక్రవారం జిల్లాలో అన్ని పాఠశాలల ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో విధులకు  హాజరయ్యారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో 23 మండలాల తహసీల్దార్ గార్లకు మెమోరాండం అందించారు .

జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి D వెంకటేశ్వరరావు B రవి గార్లు నల్లబ్యాడ్జీతో ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు పొదుపు చేసుకున్న సొమ్ము(GPF, TSGLI) పట్ల ప్రభుత్వాలు బాధ్యత కలిగి ,ఖాతాలను నిర్వహించి వారు కోరినప్పుడు వెంటనే అందించాల్సిన వున్నది ,కానీ పొదుపు సొమ్ము ప్రభుత్వం వాడుకోవడం వలనే సకాలంలో బిల్లులు చెల్లించలేకపోతున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుడు పొదిలి .సత్యనారాయణ కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినారు. మండల కమిటీ ఆధ్వర్యంలో అన్ని మండలాల్లో తహసీల్దార్ గార్లకు మెమోరాండం అందించే కార్యక్రమం నిర్వహించారన్నారు.