మునగాల, జనవరి 31:- మండలం రేపాల గ్రామంలో గత నాలుగు రోజులుగా నీళ్లు రాక ప్రజలు ఇబ్బంది పడుతున్నారని గ్రామపంచాయతీ కార్యదర్శి బ్రహ్మ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ శాఖ కార్యదర్శి ఎర్ర వెంకటేశ్వర్లు మాట్లాడుతూ. గత నాలుగు రోజులుగా ఎస్సీ కాలనీలో నీళ్లు లేక కాలనీ ప్రజలు పిల్లలు.వృద్దులు.
ఇబ్బందులు పడుతున్నారు వేసవి రాకముందే నేటి సమస్యలు ఇలా ఉంటే మరికొద్ది రోజుల్లో వేసవికాలం రాబోతుంది కాబట్టి సంబంధిత అధికారులు సిబ్బంది అప్రమత్తంగా ఉండి వెంటనే నీటి సమస్యలు రాకుండా చూడాలని ఆయన కోరారు, ఈ కార్యక్రమంలో.
వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు సంపంగు జానయ్య. సిపిఎం పార్టీ మునగాల మండల కమిటీ సభ్యులు తుమ్మ సతీష్ , సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు గంట వెంకటేశ్వర్లు. పార్టీ సభ్యుడు పొనుగోటి నాగరాజు. డివైఎఫ్ఐ మండల కమిటీ సభ్యులు పొనుగోటి సాయి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు