తనతో సహజీవనం చేస్తున్న మహిళను నిర్భందించారని మరో మహిళ పిటిషన్
ఏపీ హైకోర్టు విచారణ
విజయవాడ, డిసెంబర్ 17 (విజయక్రాంతి): తనతో సహజీవనం చేస్తున్న స్నేహితురాలు జ్యోతిని నిర్భంధించారంటూ పల్లవి అనే మహిళ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. లెస్బియన్‌గా తనతో సహజీవనం చేస్తున్న జ్యోతిని ఆమె తండ్రి అక్రమంగా నిర్బంధించారంటూ ఎన్టీఆర్ జిల్లాకు చెందిన పల్లవి అనే మహిళ పిటిషన్ వేశారు. జ్యోతిని కోర్టులో హాజరుపర్చేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ హెబియస్ కార్పస్ పిటిషన్‌ను జస్టిస్ రావు రఘునందన్‌రావు, జస్టిస్ కుంచం మహేశ్వ రరావుతో కూడిన డివిజన్ బెంచ్ మరోసారి విచారించింది.
జ్యోతి తం డ్రికి జారీ చేసిన నోటీసులు వాపస్ వచ్చాయి. దీంతో జ్యోతిని తమ ఎదుట హాజరుపర్చాలన్న గత ఆదేశాల మేరకు మంగళవారం జ్యోతిని పోలీసులు హైకోర్టులో హాజరుపర్చారు. న్యాయమూర్తులు తమ చాంబర్‌లో జ్యోతితో మాట్లాడారు. జ్యోతి మేజర్ కాబట్టి ఆమె అభీష్టానికి అనుగుణంగా వ్యవహరించవచ్చునని తేల్చారు. తొలుత పల్లవి లాయర్ జడా శ్రవణ్‌కుమార్ వాదిస్తూ.. లెస్బియన్ సంబంధం చట్టబద్ధమని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినందున జ్యోతిని ఆమె తండ్రి నిర్బంధించడం చెల్లదని అన్నారు.