ముత్తారం (విజయక్రాంతి): ముత్తారం మండల కేంద్రంలోని కాసర్ల గడ్డ బస్టాండ్ వద్ద మరుగుదొడ్డి నిర్మించాలని తాసిల్దార్ సుమాన్ కు గ్రామస్తులు వినతి పత్రం సమర్పించారు. కాసర్లగడ్డ బస్టాండ్ నుండి నిత్యం రోజు వందల ది మంది ప్రయాణం చేస్తుంటారని,. కాని అ బస్టాండ్ వద్ద ఇప్పటి వరకు మరుగుదొడ్లు లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బస్టాండ్ వెనకాల గల ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జా చేసుకుని ఇల్లు నిర్మించుకున్నారనీ, వారి నుంచి అ భూమిని విడిపించి అదే భూమి లో మరుగుదొడ్డి నిర్మించాలని గ్రామస్తులు పేయ్యల కుమార్, పింగిలి దేవేందర్ రెడ్డి, అలగం రాజేశం, చింతిరెడ్డి బాబురెడ్డి, ఆలువోజ్ రవీందర్, అమ్ము శ్రీనివాస్, నూనెటి కృష్ణ, పీంగిలీ సంజీవరెడ్డి, గుడి రాజేశం, గుడి రవి, తోట భూమన్న, జక్కుల రాజయ్య, ఎర్ర రవీందర్, రామిండ్ల శ్రీశైలం, ఇందారపు లక్ష్మి, రేగుంట గంగయ్య, గద్దె సమ్మయ్య, మరుగుదొడ్లు తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు.