calender_icon.png 25 November, 2024 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అదానీపై సుప్రీంలో పిటిషన్

25-11-2024 02:51:27 AM

లంచాల ఆరోపణలపై భారత్‌లోనే విచారించాలని విజ్ఞప్తి 

న్యూఢిల్లీ, నవంబర్ 24: సౌర విద్యుత్తు కోసం ఒప్పందం చేసుకోవడానికి అదానీ సంస్థ భారత అధికారులకు లంచం ఇవ్వజూపిందని అమెరికా చేసిన ఆరోపణలపై భారత దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలని సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. దేశ ప్రయోజనాల దృష్ట్యా అదానీ గ్రూప్ అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించడం అత్యంత అవసరమని పిటిషన్ దాఖలు సందర్భంగా న్యాయవాది విశాల్ తివారీ పేర్కొన్నారు.

అదానీపై తాజాగా వచ్చిన అభియోగాలు తీవ్ర మైనవిగా పరిగణించి వెంటనే  దర్యాప్తుకు ఆదేశించాలని కోరారు. అలాగే అదానీ గ్రూప్స్‌పై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలపై దర్యా ప్తు చేసి నిజానిజాలు బయటపెట్టాల్సిన సెబీ ఆందోళనకరంగా వ్యవహరిస్తోందని విమర్శించారు.

హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాల్సిందిగా సెబీకి సుప్రీం కోర్టు ఈ ఏడాది జనవరి 3న డెడ్‌లైన్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయినా సెబీ మాత్రం ఇప్పటి వరకూ నివేదికను ఫైల్ చేయలేదని అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తన నివేదికను సమర్పించకపోతే సెబీపై ప్రజ ల్లో విశ్వాసం సన్నగిల్లుతుందన్నారు. ఇదిలా ఉంటే గౌతమ్ అదానీకి తాజాగా అమెరికా సెక్యూరిటీ అండ్ ఎక్సేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ) సమన్లు పంపింది.