హైదరాబాద్: డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహప్రతిష్టాపన అంశంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విగ్రహ ప్రతిష్ట నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని పిటిషనర్ జూలూరు గౌరిశంకర్ హైకోర్టును కోరారు. తెలంగాణ తల్లి విగ్రహరూపంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పిల్ దాఖలు చేశారు. విగ్రహం మార్చడం ప్రజల మనోభావాలు దెబ్బతింటాయని పిటిషనర్ పేర్కొన్నారు. రిజిస్ట్రీ పరిశీలనలో ఉన్న గౌరి శంకర్ ప్రజాప్రయోజన వ్యాజ్యం వేశారు. తెలంగాణ తల్లి విగ్రహ నమూనాను ప్రభుత్వం అధికారికంగా డిసెంబర్ 9న ఆవిష్కరించింది. సచివాలయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ విగ్రహాన్ని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ గంగాధర్ రూపొందించారు.