calender_icon.png 1 April, 2025 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం

26-03-2025 01:59:19 AM

కాటారం, మార్చి 25 (విజయక్రాంతి) :  ఆశా కార్యకర్తలకు జీతాల పెంపు తదితర అంశాల పట్ల ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాల మేరకు హామీలు అమలు చేయకపోవడం పట్ల నిరసన తెలియజేస్తూ ఆశా కార్యకర్తలు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు.

మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండల కేంద్రమైన గారేపల్లి లో గల అంబేద్కర్ విగ్రహానికి ఆశా కార్యకర్తలు వినతిపత్రం అందజేశారు. మానవహారంగా ఏర్పడి నినాదాలు చేశారు. హైదరాబాదులో ఆశా కార్యకర్తలు చేస్తున్న కార్యక్రమాన్ని విచ్ఛిన్నం చేయడానికి పోలీసులతో దాడులు చేయడాన్ని నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన పిలుపుమేరకు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.  నాయకులు రమేష్, రవి, ఆశా కార్యకర్తలు కే రాజేశ్వరి, జయప్రద, బి పద్మ , ఎం రమాదేవి, ఏ లత, జె సమ్మక్క, సరూప రాణి, కె లక్ష్మి, టీ నాగమణి, బి స్వరూప, ఏం వసంత, పి స్వరూప, బి శైలజ, పార్వతి, కాంతా, జ్యోతి, లక్ష్మి, శారద పాల్గొన్నారు.