calender_icon.png 23 October, 2024 | 4:54 AM

‘సేనాపతి’పై పిటిషన్ దాఖలు

11-07-2024 12:05:00 AM

‘భారతీయుడు విడుదలను నిలిపివేయాలంటూ ఆసాన్ రాజేంద్రన్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా మర్మకళ టెక్నిక్స్‌ను ఈ చిత్రంలో వాడుకున్నారంటూ మదురై జిల్లా కోర్టులో పిటిషన్ వేశారాయన. బుధవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం వివరణ ఇవ్వాలంటూ చిత్రబృందానికి నోటీసులు జారీ చేసి, తదు పరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. ప్రాచీన యుద్ధ కళల్లో ఒక్కటైన మర్మకళలో రాజేంద్రన్ ప్రసిద్ధుడు. ఆయన రాసిన పుస్తకం చదివిన దర్శకుడు శంకర్.. ‘భారతీయుడు’లోని సేనాపతి పాత్ర కోసం నటుడు కమల్ హాసన్‌కు రాజేంద్రన్ ప్రత్యేక శిక్షణ ఇప్పించారు. తాజాగా వస్తున్న సీక్వెల్‌లోనూ తన అనుమతి లేకుండా మర్మకళ టెక్నిక్స్ వాడారనేది రాజేంద్రన్ ఆరోపణ.