నారాయణపేట, జనవరి 31 (విజయ క్రాంతి): ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినీ తన నివాసంలో కలిసిన నారాయణపేట ఎమ్మెల్యే డా చిట్టెం పర్ణిక రెడ్డి ,మాజీ డీసీసీ అధ్యక్షులు కుంభం శివకుమార్ రెడ్డి . నియోజకవర్గంలోని సమస్యల గురించి ముఖ్యమంత్రి దష్టికి తీసుకెళ్లడం జరిగింది.
నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం లో భాగంగా కొన్ని మార్పులు చేర్పులు చేయడం వలన నారాయణపేట రైతులకు అదనంగా వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందని కోరగా ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు.
అలాగే నియోజకవర్గంలోని ధన్వాడ మండలంలోని డిగ్రీ కళాశాలలకు నూతన భవనం, కోయిలకొండ మండలంలో డిగ్రీ కళాశాల, మరికల్ మండలంలో ఇంటర్మీడియట్ కళాశాల, ధన్వాడ డబుల్ లేన్ రోడ్డు మొదలగు వాటి గురించి చర్చించడం జరిగింది.
అదేవిధంగా నియోజకవర్గంలో 3 కొత్త మండలాలు, నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటు గురించి చర్చించారు. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణపేట నియోజకవర్గానికి నిధులు మంజూరు చేసి అభివద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారు.