- కామారెడ్డి జీవన్‌దాన్ హైస్కూల్‌లో ఘటన
- తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ఆందోళన
పాఠశాల వద్ద తీవ్ర ఉద్రిక్తత.. భారీ బందోబస్తు
రాళ్లు రువ్విన ఆందోళనకారులు
పోలీసులకు గాయాలు
నిందితుడిపై పోక్సో కేసు నమోదు: ఎస్పీ
కామారెడ్డి, సెప్టెంబర్ 24(విజయక్రాంతి) : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవదాన్ హై స్కూల్‌లో నర్సరీ చదువుతున్న ఆరు సంవత్సరాల చిన్నారితో మంగళవారం పాఠశాల పీఈటీ నాగరాజు వికృత చేష్టలు తీవ్ర ఉద్రిక్తతకు దారీ తీశాయి. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లితండ్రులు, విద్యార్థి సంఘాలు పాఠశాలకు వచ్చి ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్‌ను నిలదీశారు.
ప్రిన్సిపాల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. సరైన పర్యవేక్ష ణ లేకపోవడంతోనే పీఈటీ బాలికపై వికృత చేష్టలకు పాల్పడినట్లు ఆరోపించారు. పీఈటీ నాగరాజుపై పోక్సో కేసు నమోదు చేసి, అరె స్ట్ చేయాలని డిమాండ్ చేశారు. విషయం తె లుసుకున్న మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం ఇం దుప్రియ, మరికొంత మంది కౌన్సిలర్లు పాఠశాలకు చేరుకుని ఆందోళనలో పాల్గొన్నారు.
తరగతి గదుల్లో ఉన్న పిల్లలను బయటకు ప ంపేందుకు ప్రయత్నించగా విద్యార్థులు భ యంతో వణికిపోయారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు అక్కడకు చేరుకు ని ఆందోళనకారులను సముదాయించే ప్ర యత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లతో దా డులు చేయడంతో పట్టణ సీఐ చంద్రశేఖర్‌రెడ్డి తలకు గాయం కావడంతో పాటు, ఎస్సై రాజు, మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి.
దీంతో పోలీసులు లాఠీ ఝళిపిం చడంతో విద్యార్థి సంఘాల నాయకులు, వి ద్యార్థుల తల్లితండ్రులు మరింత రెచ్చిపోయా రు. పాఠశాల ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. డీఎస్పీ నాగేశ్వర్‌రావు అక్కడికి చేరుకుని న చ్చజెప్పే ప్రయత్నం చేసిన ఫలితం లేకపోయి ంది. అడిషనల్ ఎస్పీ నర్సింహరెడ్డి పాఠశాలకు చేరుకుని పరిస్థితి సమీక్షించారు.
ఎలాం టి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉ ండేందుకు పోలీస్ బలగాలు పాఠశాలకు చే రుకున్నాయి. అనంతరం విద్యార్థులను బ యటకు పంపించి పాఠశాలకు సెలవు ప్రకటించారు. పాఠశాల యాజమాన్యం తల్లిదం డ్రులకు మేసేజ్ పెట్టడంతో విద్యార్థుల కో సం వచ్చిన తల్లిదండ్రులు కూడా ఆందోళన లో భాగస్వామ్యం అయ్యారు.
దీంతో ఉద యం మొదలైన ఆందోళన సాయంత్రం 3.3 0 గంటల వరకు కొనసాగింది. విద్యార్థి సం ఘాలు, తల్లితండ్రులు ప్రిన్సిపాల్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రిన్సిపాల్ వచ్చి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రిన్సిపాల్‌పై దాడి జరిగేటట్లు ఉందని భావించిన పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
విషయం తెలుసుకున్న అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి, ఎస్పీ సింధూశర్మ పరిస్థితి ని సమీక్షించారు. పాఠశాల వద్ద పోలీస్ పికెటింగ్‌ను ఏర్పాటు చేశారు. పీఈటీ నాగరాజ్‌పై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్పీ సింధూశర్మ తెలిపారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం, ఇతర ఫిర్యాదులపై విచారణ జరిపిస్తామని అడిషినల్ కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి హమీ ఇచ్చారు.