05-03-2025 01:31:53 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 4 (విజయక్రాంతి): సైరన్ వేసుకుంటూ వేగంగా వెళ్తున్న ఓ అంబులెన్సు తనిఖీ చేయగా పెంపుడు కుక్క కనిపించింది. దీంతో అంబులెన్సు డ్రైవర్‌తోపాటు వాహన యజ పోలీసులు కేసు నమోదు చేశారు.
మంగళవారం మియాపూర్ వైపు వెళ్తున్న అంబులెన్స్‌ను పంజాగుట్ట జంక్షన్ వద్ద పోలీసులు ఆపి తనిఖీ చేయగా రోగులను తరలించే అంబులెన్స్‌లో పెంపుడు కుక్క ఉండ చూసి అవాక్కయ్యారు. మియాపూర్‌లోని ఆస్పత్రిలో వేసేక్టమీ ఆపరే కోసం తమ యజమాని పెంపుడు కుక్కను తీసుకువెళ్తున్నానంటూ సదరు డ్రైవర్ చెప్పాడు. సైరన్‌ను దుర్వినియోగం చేసినందుకు డ్రైవర్‌పై, అంబు యజమానిపై కేసు నమోదు చేశారు.