calender_icon.png 25 October, 2024 | 3:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పురుగు మందుతో ప్రజావాణికి!

09-07-2024 02:36:45 AM

  • భూమి వేరొకరి పేరుపై నమోదైందని సూర్యాపేటలో మహిళ.. 
  • భూమి వివరాలు నమోదు కాలేదని జనగామలో దివ్యాంగుడు.. 
  • సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్లు, అధికారులకు బాధితుల వేడుకోలు

సూర్యాపేట/కరీంనగర్/జనగామ, జూలై 8 (విజయక్రాంతి): తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఇద్దరు బాధితులు జిల్లాల్లో సోమవారం కలెక్టరేట్లలో జరిగిన ప్రజావాణికి పురుగు మందు డబ్బాలతో వచ్చాడు. మరో జిల్లాలో దివ్యాంగుడు పింఛను కోసం పెట్రోల్ బాటిల్‌తో వచ్చాడు. అధికారులు, పోలీసులు ముందే అప్రమత్తమై వాటిని స్వాధీనం చేసుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. 

తన భూమిని వెరొకరు పట్టా చేసుకున్నారని ఓ మహిళ సోమవారం సూర్యాపేట కలెక్టరేట్‌లో జరిగిన ప్రజావాణికి పురుగు మందు తీసుకుని వచ్చింది. డ్యూటీ కానిస్టేబుల్ ముందుగానే ఆమె వద్ద పురుగు మందు గుర్తించి, దానిని స్వాధీనం చేసుకున్నాడు. అనంతరం బాధితురాలు ప్రభుత్వ అధికారులకు తన గోడు వెళ్లబోసుకున్నది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. చిలుకూరు మండలం బేతవోలుకు చెందిన నాపసాని కళమ్మకు గరిడేపల్లి మండలం గడ్డిపల్లి శివారులో తల్లిదండ్రులు పసుపు కుంకుమ కింద ఇచ్చిన కొంత భూమి ఉన్న ది. తన భూమి వేరొకరి పేరుపై బదిలీ అయిందని, రెవెన్యూశాఖ అధికారులకు ఈ విషయం తెలిపినప్పటికీ పట్టించుకోలేదు. దీంతో ఆమె కలెక్టరేట్‌కు వచ్చి అధికారులకు ఫిర్యాదు అందించింది. తన సమస్యను పరిష్కరించాలని వేడుకున్నది.

‘ధరణి’సమస్యపై కరీంనగర్‌లో దంపతులు..

కరీంనర్ జిల్లా రామడుగు మండలానికి చెందిన ఒగ్గు రాజమల్లు తన భూమి వివరాలు ధరణిలో నమోదు కాలేదని సోమవారం కరీంనగర్ కలెక్టరేట్‌కు భార్యతో కలిసి పురుగు మందు డబ్బాతో వచ్చాడు. గమనించిన పోలీసులు వెంటనే రాజమల్లు వద్దకు వచ్చి పురుగు మందును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం భార్యాభర్తలిద్దరూ కలెక్టర్ ముందు గోడు వెల్లబోసుకున్నారు. అలాగే రామడుగు మండలానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ జగన్మోహన్‌గౌడ్ ‘మన ఊర్టు మనబడి’ నిధుల విడుదలపై కలెక్టర్‌కు వినతి అందించాడు. రూ.60 లక్షల వరకు నిధులు నిలిచిపోయాయని, వాటిని విడుదల చేయాలని ఎన్నిసార్లు అధికారుల కు విన్నవించినా పట్టించుకోవడం లేదంటూ వాపోయాడు. 

పింఛను కోసం దివ్యాంగుడు..

భూసమస్య పరిష్కరించాలంటూ ఓ వ్యక్తి ఇప్పటికే ప్రజావాణిలో మూడుసార్లు ఒంటి పై పెట్రోల్ పోసుకోబోయాడు. మూడుసార్లు పోలీసులు, అధికారులు అప్రమత్తమై బాధితుడిని అడ్డుకున్నారు. గత వారం నర్మె ట మండలానికి చెందిన ఓ మహిళ పెట్రోల్ బాటిల్‌తో గ్రీవెన్స్‌కు వచ్చింది. ఆ ఘటనలు మరువకముందే తాజాగా ఓ దివ్యాంగుడు పెట్రోలు తీసుకుని జనగామ కలెక్టరేట్‌కు రావడం కలకలం రేపింది. తెలిసిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా బచ్చన్నపేట మం డలం అలీంపూర్‌కు చెందిన పాకాల రమేశ్ 2021లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కాలు కోల్పోయాడు.

రమేశ్‌ను దివ్యాంగుడిగా గుర్తిస్తూ అధికారులు అతడికి 2022లో సదరం సర్టిఫికెట్ ఇచ్చారు. రమేశ్ వెంటనే పింఛన్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. కానీ ఇప్పటివరకు పింఛన్ మంజూరు కాలే దు. దీంతో రమేశ్ సోమవారం పెట్రోల్ డబ్బా పట్టుకుని వీల్‌చైర్‌పై ప్రజావాణికి వచ్చాడు. పోలీసులు అప్రమత్తమై పెట్రోల్ డబ్బాను లాక్కున్నారు. అనంతరం దివ్యాంగుడి సమస్య అడిగి తెలుసుకున్నారు. విష యం తెలుసుకున్న కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ దివ్యాంగుడిని దగ్గరికి పిలిపించుకుని సమస్యను విన్నారు. పింఛన్ మంజూరయ్యే వరకు ఓపిక పట్టాలని దివ్యాంగుడికి సూచించారు. దివ్యాంగుడి కోటాలో రుణం అందిం చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.