calender_icon.png 30 October, 2024 | 4:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లైసెన్స్ కంపెనీల విత్తనాలు మాత్రమే విక్రయించాలి

30-10-2024 01:50:23 PM

గజ్వేల్,(విజయక్రాంతి): ప్రభుత్వ గుర్తింపు పొందిన కంపెనీలకు చెందిన విత్తనాలు పురుగుల మందులను మాత్రమే డీలర్లు విక్రయించాలని ఇన్చార్జి జిల్లా వ్యవసాయ అధికారిని రాధిక అన్నారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత బుధవారం మొదటిసారిగా గజ్వేల్ కు వచ్చిన సందర్భంగా డీఈవో రాధికను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో డీఏఓ రాధిక మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతులు ఉన్న కంపెనీల విత్తనాలు పురుగుల మందులను మాత్రమే డీలర్లు విక్రయించాలని, విత్తనాలను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి విత్తన, ఫర్టిలైజర్  డీలర్ లైసెన్స్ ను గడువులోగా రెన్యువల్ చేసుకోవాలని, లేనిపక్షంలో దుకాణాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, పురుగుల మందులను విక్రయించి వ్యవసాయ అభివృద్ధికి సహకరించాలన్నారు. డీలర్లకు ఎలాంటి సమస్యలు ఉన్న  సంప్రదించవచ్చని సూచించారు. కార్యక్రమంలో ఏడిఏ బాబు నాయక్, ఏవో నాగరాజు, విత్తన డీలర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు  గోలి సంతోష్ గుప్త, డీలర్లు  అయ్యప్ప శ్రీనివాస్, ఆరోగ్య రెడ్డి, కాంతారావు, రజనీకాంత్, వేణు,, తదితరులు పాల్గొన్నారు.