04-03-2025 07:31:26 PM
పరిగి,(విజయక్రాంతి): రైతుల సంక్షేమమే ధ్యేయంగా భావించి రాష్ట్ర ప్రభుత్వం చెరువులకుంటల మరమ్మత్తుల పనులు శరవేగంగా చేపడుతున్నదని పరిగి మార్కెట్ కమిటీ చైర్మన్ భూమన్న గారి పరుశురాం రెడ్డి అన్నారు. మంగళవారం పరిగి మండల పరిధిలోని సోండేపూర్ తండా సమీపంలో ఉన్న పెరమాల చెరువు కట్ట పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. సొండే పూర్ తండా సమీపంలో ఉన్న ఈ పెరమాళ్ళ చెరువు గత వర్షాకాలంలో భారీ వర్షాలు కురవడం చెరువు పూర్తిగా నిండి చెరువు కట్ట పగిలిపోయింది. ఈ చెరువు శిఖం 14 ఎకరాలు కాగా ఈ చెరువు కింద ఆయకట్టు దాదాపు మూడు గ్రామాలకు సంబంధించి 80 ఎకరాల వ్యవసాయ పొలం ఉన్నట్లు చెప్పారు.
మూడు గ్రామాల రైతులకు ఎటువంటి పంట నష్టం జరగకూడదని భావించిన మన పరిగి ఎమ్మెల్యే టి రామ్మోహన్ రెడ్డి పగిలిపోయిన పెరమాల చెరువు కట్టను వెంటనే గండి పూడ్చేందుకు తొమ్మిది లక్షల నిధులు మంజూరు చేయించారని ఈరోజు గండి పూడ్చే పనులు ప్రారంభం చేపట్టడం జరిగిందని పూర్తిగా నాణ్యతతో కూడిన పనులు చేయడం ఎటువంటి అవకతవకలు జరిగిన సహించేది లేదని పేర్కొన్నారు. వర్షాకాలం ప్రారంభమయ్యే నాటికి ఈ చెరువు కట్ట పనులు పూర్తి చేయడం జరుగుతుందని కాంట్రాక్టర్లు ఎక్కడ నిర్లక్ష్యం చేయకుండా నాణ్యతతో కూడిన పని చేయాలని అది వర్షాలు పడే లోపట చేయాలని కాంట్రాక్టర్కు సూచించారు. పరిగి మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు రంగంపల్లి సత్యనారాయణ ముదిరాజ, మండల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తావూరియా నాయక్, పరిగి ఇరిగేషన్ కు సంబంధించిన అధికారులు మూడు గ్రామాలకు సంబంధించిన రైతులు పాల్గొన్నారు.