జిల్లా ఎస్పీ డీ జానకి సైబర్ క్రైమ్, రోడ్డు భద్రత ట్రాఫిక్ నిబంధనల పై అవగాహన
మహబూబ్‌నగర్, జనవరి 25 (విజయక్రాంతి) : ఆధునిక కాలంలో వ్యక్తిగత భద్రత అనే అంశం అతిముఖ్యమైనదని జిల్లా ఎస్పీ డీ జానకి అన్నారు. శనివారం దేవరకద్ర మండలం వెంకటయ్యపల్లి గ్రామం నందు రోడ్డు భద్రతా , సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డీ జానకి ప్రజల భద్రత, స్వీయ జాగ్రత్తల ప్రాధాన్యతను వివరించారు.
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలను తగ్గించవచ్చు. వేగం నియంత్రించడం, మద్యం సేవించి వాహనం నడపకపోవడం అత్యంత అవసరమని పేర్కొన్నారు. యువతను హెల్మెట్ ధరించడంలో ముందుండాలని, సీట్ బెల్ట్ పెట్టుకోవడం అలవర్చు కోవాలని సూచించారు.
అన్ని విషయాలు తెలిసి కూడా నిర్లక్ష్యం వహిస్తే ప్రమాదమని వచ్చేది చెప్పి రాదని ముందు జాగ్రత్తలు తీసుకుంటేనే మేలు జరుగుతుందని విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని తెలిపారు. డిజిటల్ ప్రపంచంలో ప్రతి ఒక్కరు తమ వ్యక్తిగత సమాచారాన్ని రక్షించుకోవాలి. అనుమానాస్పద లింకులు, ఫోన్ కాల్స్, సందేశాల ద్వారా మోసపోవడం జరుగుతుంది. అందుకే జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు.
బ్యాంకింగ్ ఫ్రాడ్లు, పిరమిడ్ స్కామ్లు వంటి మోసాలపై అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎస్త్స్ర నాగన్న, తదితరులు ఉన్నారు.