calender_icon.png 22 December, 2024 | 7:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యోగాతో వ్యక్తి పరిపూర్ణత

21-12-2024 07:18:46 PM

రాష్ట్ర యోగాలో తిరుగులేని కరీంనగర్ 

తెలంగాణ యోగ సంఘం చైర్మన్ రవీందర్ సింగ్... 

కరీంనగర్ (విజయక్రాంతి): వ్యక్తి పరిపూర్ణతకు యోగా దోహదపడుతుందని తెలంగాణ యోగ అసోసియేషన్ చైర్మన్ సర్దార్ రవీందర్ సింగ్ తెలిపారు. ఈ మేరకు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో కరీంనగర్ ప్రాంతీయ క్రీడా పాఠశాలలో శనివారం సీఎం కప్ జిల్లా స్థాయి యోగ వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ పోటీల ముగింపు కార్యక్రమానికి రవీందర్ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చిన్నారుల మొదలు పెద్దల వరకు ప్రతి ఒక్కరు యోగాలో నిష్ణాతులైతే సంపూర్ణ ఆరోగ్యానికి తోడు నిత్యజీవితంలో అన్ని రంగాల్లో విజేతలుగా నిలిచే అవకాశం ఉందన్నారు. నిశ్చలమైన మనస్సుతో అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు యోగ ఉపకరిస్తుందన్నారు.

రాష్ట్రంలోనే కరీంనగర్ యోగా క్రీడాకారులు రాష్ట్ర జాతీయ స్థాయిలో పతకాల సాధనతో తిరుగులేని విజయాలు సాధిస్తుండటం స్ఫూర్తిదాయకమన్నారు. ఇది ఒరవడిని రాష్టస్థాయి సీఎం కప్ లో కొనసాగించి కరీంనగర్ ను నెంబర్ వన్ గా నిలపాలని ఆకాంక్షించారు. జిల్లా క్రీడలు యువజన శాఖ అధికారి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. జిల్లాలోని క్రీడా సంఘాలు, వ్యాయామ ఉపాధ్యాయుల సహకారంతో సీఎం కప్ జిల్లా స్థాయి పోటీలు విజయవంతంగా నిర్వహించినట్లు చెప్పారు. రాష్ట్ర పోటీలో మన జిల్లా క్రీడాకారులు మంచి ప్రతిభ కనబరిచి ఎక్కువ పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. అనంతరం పోటీలో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు మెడల్స్ ప్రధానం చేశారు.

ఉదయము యోగ, వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ పోటీలను జిల్లా క్రీడలు యువజన శాఖ అధికారి వి. శ్రీనివాసు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ యోగ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి సిద్ధారెడ్డి, జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాబు శ్రీనివాస్ గౌడ్, పేట అధ్యక్షులు సొల్లు సారయ్య, అంతడుపుల శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయులు అంతటి శంకరయ్య, పోతన శ్రీనివాస్, చంద్రశేఖర్, వీరన్న, సౌజన్య, వెంకటలక్ష్మి, కోచులు రామకృష్ణ, మల్లేశ్వరి, ఆనంద్ కిషోర్, రాజశేఖర్, పవన్ సాయి తదితరులు పాల్గొన్నారు.