04-03-2025 12:17:39 AM
జిల్లా మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త సౌజన్య
మంచిర్యాల, మార్చి 3 (విజయక్రాంతి) : విద్యార్థినిలు, మహిళలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని జిల్లా మహిళా సాధికారత కేంద్రం సమన్వయకర్త సౌజన్య అన్నారు. సోమవారం మహిళాభివృద్ధి శిశుసంక్షేమ శాఖ మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో నస్పూర్ మునిసిపాలిటీలోని తీగల్‌పహాడ్ జడ్‌పీఎస్‌ఎస్ పాఠశాలలో విద్యార్థినిలకు రుతుక్రమ పరిశుభ్రతపై అవగాహన సదస్సు, సానిటరీ నాప్కిన్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో మాట్లాడారు.
కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్‌వైజర్ చందన, జిల్లా మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ విజయ, అకౌంటెంట్ వసంతలక్ష్మి, శైలజ, విద్యార్థినిలు, ఉపాధ్యాయునిలు పాల్గొన్నారు.