calender_icon.png 19 November, 2024 | 7:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి

19-11-2024 05:51:12 PM

మంచిర్యాల (విజయక్రాంతి): ప్రతి ఒక్కరు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం మరుగుదొడ్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లాలోని హాజీపూర్ మండల తహసిల్దార్ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, తహసిల్దార్ శ్రీనివాసరావు దేశ్ పాండేతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నివాస ప్రాంతాలు, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడంతో వ్యాధులను దూరంగా ఉంచవచ్చన్నారు.

ప్రతి ఇంటికి వ్యక్తిగత మరుగుదొడ్డి తప్పనిసరిగా ఉండాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడంతో వ్యాధులు దరి చేరకుండా ఆరోగ్యంగా ఉండవచ్చని తెలిపారు. ప్రభుత్వం పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారిస్తుందని, గ్రామపంచాయతీలు, పురపాలక సంఘాలలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పారిశుద్ధ్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు మంజూరైన ప్రొసీడింగ్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ప్రసాద్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.