డాక్టర్ మౌనిక...
లక్షేట్టిపేట (విజయక్రాంతి): తప్పనిసరిగా వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలి అని డాక్టర్ మౌనిక అన్నారు. సోమవారం తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయంలో 9వ తరగతి నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఏర్పాటు చేసిన చైల్డ్ ఏంపవర్మెంట్ ప్రోగ్రాం కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా డాక్టర్ మౌనిక మాట్లాడుతూ..... ముఖ్యంగా టీనేజ్ లో ఉన్నటువంటి ఆడపిల్లలు.. ఆరోగ్యంగా ఉండాలంటే, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని అన్నారు. విద్యార్థులు పౌష్టికాహారం తీసుకోవాలని అన్నారు. చర్మవ్యాధులు విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
అనంతరం పోలీస్ కానిస్టేబుల్ ప్రవళిక మాట్లాడుతూ.... టీనేజ్ లో ఆడపిల్లలు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి.. అవగాహన కలిగి ఉండాలని అన్నారు. టీనేజ్ లో అపరిచితులైన అబ్బాయిలతో ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలని అన్నారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని, భద్రంగా చదువుకోవాలని తెలియజేశారు. ఇటీవల కాలంలో సైబర్ నేరాలు విచ్చలవిడిగా పెరుగుతున్నాయని, అపరిచితమైన లింకుల వంటివి వచ్చినట్లయితే అప్రమత్తంగా ఉండాలని అపరిచిత టెలిఫోన్ కాల్స్ తో కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు. విద్యార్థులందరూ తల్లిదండ్రులకు అవగాహన కలిగించాలని కానిస్టేబుల్ ప్రవళిక తెలియజేశారు.
విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా వ్యక్తిగతంగా తమకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చినట్లయితే తగు విధంగా సహకారం అందిస్తామని తెలియజేశారు. అనంతరం విద్యార్థినులు అడిగిన పలు సందేహాలకు డాక్టర్ మౌనిక, పోలీస్ కానిస్టేబుల్ ప్రవళిక సవివరంగా సమాధానాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కే. రామ కల్యాణి, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ కే. మహేశ్వర రావు, చైల్డ్ ఎంపవర్మెంట్ ప్రోగ్రాం కోఆర్డినేటర్లు హెచ్. శ్రీలత, ఆర్. ప్రవీణ లు, ఇతర ఉపాధ్యాయునులు పాల్గొన్నారు.