న్యూఢిల్లీ: తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ తనకు పర్సనల్ కోచ్ కావాలని తెలిపింది. మొన్న జరిగిన ఒలింపిక్స్‌లో నిరాశపర్చిన జరీన్ మరింత మెరుగయ్యేందుకు పర్సనల్ కోచ్ కావాలని అంటోంది. బాక్సింగ్‌లో నిఖత్ పతకం తెస్తుందని అంతా ఆశించినా కానీ తీవ్రంగా నిరాశపర్చింది. ‘మనది కాని రోజు ఎంతటి వారైనా సరే ఏమీ చేయలేరు. కానీ మేము నిజాన్ని ఒప్పుకుని ముందుకు సాగాలి. నేనే ఏదీ పెద్దగా ప్లాన్ చేయలేదు. ఫ్లోను బట్టి వెళ్లాలని నిర్ణయించుకున్నా. మరింత మెరుగ్గా రాణించేందుకు నాకు పర్సనల్ కోచ్ కావాలి’ అని జరీన్ తెలిపింది.