కోనరావుపేట, డిసెంబర్ 29: అనారో గ్యంతో వ్యక్తి మృతిచెందగా చందాలతో అంత్యక్రియలు చేసిన ఘటన మండలం లోని మామిడిపల్లి గ్రామంలో చోటుచేసు కుంది. గ్రామానికి చెందిన శ్రీరామోజీ వెంకటస్వామి (88) వ్యక్తి నిరుపేద వ్యకి ఇటీవల ఆనారోగ్యానికి గురి కాగా తీవ్ర అస్వస్థతో ఇంటి వద్దనే మృతిచెందాడు. మృతుడికి భార్య రమాదేవి, కుమారులు ఉన్నారు. గ్రామస్తులు చందాలు పోగు చేసి అంత్యక్రియలు నిర్వహించారు.