ఇల్లెందు,(విజయక్రాంతి): ఇల్లెందు - మహబూబాబాద్ మార్గంలోని జెండాలవాగు సమీపంలో ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించగా, మరో ఇద్దరు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు స్పందించి, గాయపడిన వారిని ఇల్లందు ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి ఇల్లందు మండలం లచ్చగూడెం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇల్లందు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, వాహన వేగం నియంత్రణలో లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.