ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
హార్ట్ స్ట్రోక్ తో మృతి చెందాడా? వేరే ఇతర కారణంతో మృతి చెందాడా ?
దర్యాప్తు చేస్తున్న పోలీసులు
అలంపూర్: అలంపూర్ పట్టణంలో ఓ ప్రముఖ ప్రైవేట్ విద్యాసంస్థలో పనిచేసే వ్యక్తి ఆకస్మికంగా మృతి చెందిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.స్థానికులు వివరాల ఇలా ఉన్నాయి. ఏపీలోని కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం కులుమాల గ్రామానికి చెందిన ఆంజనేయులు తమ కుటుంబ సభ్యులతో కలిసి అలంపూర్ పట్టణంలోని ఓ ప్రముఖ ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్నారు. స్థానికంగా నివాసం ఉంటూ అతడి పిల్లలను అదే పాఠశాలలో చదివిస్తున్నారు.
భార్యాభర్తలు కూడా అదే స్కూల్లోనే పని చేస్తున్నారు.ఈ క్రమంలో శుక్రవారం సుమారు మూడున్నర గంటల ప్రాంతంలో వంట గదిలో ఆంజనేయులు సృహ తప్పి పడిపోవడం గమనించిన యాజమాన్యం భార్యకు సమాచారం ఇచ్చారు.వెంటనే పాఠశాల యాజమాన్యం ఆంజనేయులును ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్దారించారు.సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.అయితే మృతుడు హార్ట్ స్ట్రోక్ తో చనిపోయాడా? లేక వేరే ఇతర కారణంతో మృతి చెందాడా?అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది..