calender_icon.png 2 January, 2025 | 8:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

14-09-2024 01:31:15 PM

భద్రాద్రి కొత్తగూడెం, విజయక్రాంతి: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పాల్వంచ పట్టణ పరిధిలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన కొమ్ము రామకృష్ణ (45) చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు. వివరాల్లోకెళ్తే విపరీతంగా కడుపునొప్పి రావడంతో గత నెల 26వ తేదీ కొత్త గూడెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. పరీక్షించిన వైద్యులు అపెండెక్స్ (24 గంటల కడుపునొప్పి) అంటూ ఆపరేషన్ నిర్వహించారు. కడుపులో ఇన్ఫెక్షన్ రావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించాలన్నారు. ఈనెల 11వ తేదీన హైదరాబాద్ లోని నీమ్స్ ఆస్పత్రిలో చేర్పించారు అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందాడు.