రాజన్న సిరిసిల్ల: జిల్లాలో దారుణ హత్య జరిగింది. గంభీరావుపేట మండలం సముద్ర లింగాపూర్-తుర్కా కాశి నగర్ గ్రామాల మధ్య ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మృతుడు వీరన్ పల్లి మండలానికి చెదిన సయ్యద్ ఇమమ్ గా పోలీసులు గుర్తించారు. ఘటనపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు పేర్కొన్నారు.